ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 06 September 2026, 3:06 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

బెల్లంపల్లి సూపర్ బజార్ పై బడా వ్యాపారుల కన్ను !-సింగరేణి సూపర్ బజార్ ప్రైవేట్ చేస్తే సహించంవిప్లవ కార్మిక సంఘాల డిమాండ్సింగరేణి సూపర్ బజార్ ను యాజమాన్యమే నిర్వహించాలి.

బెల్లంపల్లి సూపర్ బజార్ పై బడా వ్యాపారుల కన్ను !-సింగరేణి సూపర్ బజార్ ప్రైవేట్ చేస్తే సహించం
విప్లవ కార్మిక సంఘాల డిమాండ్సింగరేణి సూపర్ బజార్ ను యాజమాన్యమే నిర్వహించాలి.

బెల్లంపల్లి.అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ సెప్టెంబర్ 6.

సింగరేణి కార్మికులు, ఉద్యోగుల సంక్షేమం కోసం ఏర్పాటైన సింగరేణి సూపర్‌బజార్లను బడా వ్యాపారస్తుల చేతుల్లో పెట్టే ఆలోచనను విరమించుకోవాలని కార్మికులు, ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కార్మికుల అవసరాల కోసం ఏర్పాటు చేసిన సూపర్‌బజార్‌ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే అసలు లక్ష్యమే నీరుగారిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దశాబ్దాలుగా సింగరేణి కార్మిక కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందిస్తూ వచ్చిన సూపర్‌బజార్‌ ఒక వ్యాపార సంస్థ మాత్రమే కాదని, అది కార్మిక సంక్షేమ వ్యవస్థలో భాగమని వారు పేర్కొంటున్నారు. గతంలో సూపర్‌బజార్ల ద్వారా కార్మికులకు తక్కువ ధరలకు నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులు అందించడంతో పాటు క్రెడిట్‌ సౌకర్యం కూడా ఉండేది.

ప్రైవేటు చేతుల్లో పెడితే ప్రయోజనం ఎవరికి?

సూపర్‌బజార్‌ను బడా వ్యాపారస్తులకు అప్పగిస్తే కార్మికుల ప్రయోజనాల కంటే వ్యాపార లాభాలకే ప్రాధాన్యత దక్కే అవకాశం ఉందని కార్మికులు అంటున్నారు. బయట మార్కెట్‌లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే చివరికి భారమయ్యేది సింగరేణి కార్మిక కుటుంబాలపైనే.

కార్మికుల చెమటతో నడిచే సింగరేణి సంస్థకు చెందిన సంక్షేమ సదుపాయాన్ని ప్రైవేటు లాభాల కోసం అప్పగించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

లోపాలు ఉంటే సరిదిద్దాలి.. మూసివేయడం, అప్పగించడం కాదు!

సూపర్‌బజార్‌ నిర్వహణలో లోపాలు ఉంటే వాటిని గుర్తించి సరిదిద్దాలని, సిబ్బంది కొరత, సరుకుల సరఫరా, పర్యవేక్షణ వంటి సమస్యలను పరిష్కరించాలని కార్మికులు కోరుతున్నారు. గతంలో సూపర్‌బజార్లలో పర్యవేక్షణ లోపాలు, నిర్వహణ సమస్యలపై ఆరోపణలు వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి.

లోపాలను సరిచేయకుండా సూపర్‌బజార్‌ను బడా వ్యాపారస్తులకు అప్పగించడం పరిష్కారం కాదని వారు స్పష్టం చేస్తున్నారు.

యాజమాన్యమే నడపాలి

సింగరేణి యాజమాన్యం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి సూపర్‌బజార్‌లను ఆధునీకరించాలని, ఆన్‌లైన్‌ విక్రయాలు, డిజిటల్‌ బిల్లింగ్‌, పారదర్శక స్టాక్‌ నిర్వహణ, కఠినమైన ఆడిట్‌ విధానం తీసుకురావాలని కార్మికులు సూచిస్తున్నాము.

సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటైన సూపర్‌బజార్‌ను సింగరేణి యాజమాన్యమే కొనసాగించాలి. బడా వ్యాపారస్తులకు అప్పగించే నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలి.

లేకపోతే కార్మిక సంఘాలు, కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతారని హెచ్చరిస్తున్నాము.
ఈ యొక్క కార్యక్రమంలో T. మని రామ్ సింగ్ TNTUC(SCLU) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అంబాల మహేందర్ (SGKS) సింగరేణి గని కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు, M. పోచ మల్లు (AIFTU) శ్రామిక శక్తి గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి, గజ్జె దుర్గయ్య బెల్లంపల్లి పట్టణ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు, మధునయ్య, రాజు ఏఐఎఫ్టీయూ రీజియన్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.